Telangana : వన్యప్రాణుల అభయారణ్యంలో కూలిన యాభై వేల చెట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఏటూరు నాగారంలోని వన్యప్రాణుల అభయారణ్యంలో భారీ వృక్షాలు కూలిపోయాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే బలమైన గాలులు వీయడంతో వన్యప్రాణుల అభయారణ్యంలో పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఏటూరు నాగారంలోని వన్యప్రాణుల అభయారణ్యంలో భారీ వృక్షాలు కూలిపోయాయి. ఈ అభయారణ్యం దాదాపు 200 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాదాపు యాభై వేల చెట్లు నేలకొరిగాయి. తాడ్వాయి -మేడారం గ్రామాల మధ్య ఈ ఘటన జరగడంతో అటవీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కారణాలపై...
ఎక్కువగా నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లను ఉదయం 5:30 నుంచి 7 గంటల మధ్య నరికివేసినట్లు ములుగు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు. ఆగస్ట్ 31న వచ్చిన గాలులతో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే చెట్లు కూలడంపై సరైన కారణాలను మాత్రం అటవీ అధికారుల వద్ద లేవు. అయితే దీనిపై విచారణ జరపాలని నిర్ణయించారు. చెట్లూ కూలిపోవడానికి కారణాలపై భారత వాతావరణ శాఖతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు