తెలంగాణ మహిళా యూనివర్శిటీగా కోఠి ఉమెన్స్ కాలేజి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ఏపీ మ‌హిళా యూనివ‌ర్సిటీగా..

Update: 2022-04-25 13:46 GMT

హైదరాబాద్ : తెలంగాణకు మహిళా యూనివర్శిటీ వచ్చేసింది. హైదరాబాద్ కోఠిలో ఉన్న ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్శిటీగా మార్చనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం కోఠి ఉమెన్స్ కాలేజీని మ‌హిళా విశ్వ‌విద్యాల‌యంంగా అప్ గ్రేడ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం ఏపీ మ‌హిళా యూనివ‌ర్సిటీగా కొన‌సాగింది.

తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆంధ్రాకే పరిమితవ్వగా.. తెలంగాణకు ఒక్క మహిళా యూనివర్శిటీ కూడా లేదు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రానికి కూడా మ‌హిళా యూనివ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌న్న దిశ‌గా ఆలోచించిన తెలంగాణ ప్ర‌భుత్వం...ఆ మేర‌కు కోఠి ఉమెన్స్ కాలేజీని మ‌హిళా విశ్వ‌విద్యాల‌యంగా మార్చేసింది. మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News