Rain alert : మూడు రోజులు వర్షాలే
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. ఈరోజు తెల్లవారు జామునుంచే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లో కుండపోత...
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశముందని తెిపింది. రానున్న రెండు మూడు గంటల్లో హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.