ఒక్కొక్క బూత్ కు మూడు ఈవీఎంలు

మునుగోడు ఉప ఎన్నికకు ఈవీఎంలు ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2022-10-18 04:50 GMT

మునుగోడు ఉప ఎన్నికకు ఈవీఎంలు ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మూడు ఈవీఎంలను ఉపయోగించనున్నారు. ఒక్కొక్క ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే సరిపోతాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉండటంతో మూడు ఈవీఎలను ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు ఈ మేరకు నిర్ణయించారు.

ఒక్కొక్క ఈవీఎంలు...
దాదాపు 36 మంది మంది ఇందులో స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులున్నారు. అభ్యర్థులందరికీ ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు, పేర్లతో పాటు గుర్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. నవంబరు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News