బ్రేకింగ్ : తెలంగాణలో బీజేపీ షాక్..నలుగురు జంప్

తెలంగాణలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్పొరేటర్లు అధికార టీఆర్ఎస్ లో చేరారు.;

Update: 2022-06-30 13:27 GMT

తెలంగాణలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్పొరేటర్లు అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఇది బీజేపీ నేతలు సయితం ఊహించ లేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం, ప్రధానితో సహా జాతీయ స్థాయి నేతలందరూ హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు అనూహ్యంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాండూరుకు చెందిన బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ కూడా బీజేపీలో చేరారు.

జంప్ చేసింది వీరే...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించుకుంది. హైదరాబాద్ సిటీలో తమ బలం పెరిగిందని భావించింది. బానోతు సుజాత, అర్చన ప్రకాష్, వెంకటేష్, సునీత ప్రకాష్ గౌడ్ లు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. వీరంతా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో నలుగురు కార్పొరేటర్లు జంప్ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ లో చేరారు.


Tags:    

Similar News