అమ్మో పులి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లో పులి సంచారం ప్రజలను వణికిస్తుంది. పులి ఎవరి మీద విరుచుకుపడుతుందోనన్న భయాందోళనతో ప్రజలు ఉన్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పులి సంచారం ప్రజలను వణికిస్తుంది. పులి ఎవరి మీద విరుచుకుపడుతుందోనన్న భయాందోళనతో ప్రజలు ఉన్నారు. పులిని చూసిన వారు కొందరు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వణికిపోతున్న...
ఆదిలాబాద్ జిల్లాలో పులిసంచారం స్థానికులను భయపెడుతుంది. అక్సంపూర్, కోసిని, వేంపల్లి ప్రాంతాల్లో గెదెలపై పులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా విజయనగరం జిల్లాలో మెంటాడ సమీపంలో పులి సంచారం ప్రజలను వణికిస్తుంది. జయితి సమీపంలో పులిని చేసిన స్థానికులు వణికి పోతున్నారు. రహదారిపై వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.