వైభవంగా సీతారామ కల్యాణం
భద్రాద్రిలో సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు
భద్రాద్రిలో సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. అభిజిత్ లగ్నం ముహూర్తంలో రాముల వారు సీతమ్మ వారికి మంగళసూత్రం కట్టారు. భద్రాద్రిలో జరిగిన సీతారాముల కల్యాణానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలను బహుకరించారు.
భద్రాద్రిలో...
ఈ సీతారాముల కల్యాణానికి చినజీయర్ స్వామితో పాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు, ఎంపీ మాలోతు కవిత, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంలు హాజరయ్యారు. రెండు వేల మంది భక్తులతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రసాదానికి, తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో చలవ పందిళ్లలో భక్తులు సీతారామ కల్యాణాన్ని కన్నుల పండువుగా తిలకించారు.