రేపు విగ్రహం జాతికి అంకితం
రేపు దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరగనుంది.
రేపు దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ట్యాంక్‌బండ్ సమీపంలో నెక్లెస్ రోడ్డులో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన విగ్రహం పర్యాటకులను కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని 2016 ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
146 కోట్లతో...
ఆయన ప్రకటించినట్లుగానే కేవలం రెండేళ్లలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మాణం పూర్తయింది. భూమితో కలిపి మొత్తం 175 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పు ఉన్న ఈ విగ్రహం చూసేందుకు ఇప్పటికే అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఈ విగ్రహం నిర్మాణం కోసం 155 టన్నుల ఇనుమును ఉపయోగించారు. 111 టన్నుల కంచును ఈ విగ్రహ నిర్మాణంలో వాడారు. మొత్తం 146 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. రేపు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.