రేపు ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 15వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

Update: 2022-06-14 03:07 GMT

తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నెల 15వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు ప్రకటించింది. తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,393 మంది హాజరయ్యారు. వాల్యూయేషన్ ను 14 కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేశారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ముందుగానే పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు రెడీ అయింది.

త్వరగా ప్రకటించాలని....
మే మొదటి వారంలో ప్రారంభమై చివరి వారం వరకూ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సాధ్యమయినంత త్వరగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ముందుగానే ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలను sbie.cgg.gov.in వెబ్ సైట్ లో రేపు 11 గంటల తర్వాత చూసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News