Breaking : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వతేదీ వరకూ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలిపింది. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ జరుగుతాయి.
ప్రాక్టికల్స్ పరీక్షలు...
తెలంగాణలో జనవరి 30వ తేదీన పర్యావరణ పరీక్ష జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. జనవరి 31న, ఫిబ్రవరి 1వ తేదీన ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతుందని తెలిపింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు త్వరగా పరీక్షలను నిర్వహించి వీలయినంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.