Ponguleti : చంద్రబాబు సీఎం అయినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా?
అమరావతికి పెట్టుబడులు తరలిపోవడం లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు
అమరావతికి పెట్టుబడులు తరలిపోవడం లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి అమరావతికి చేరిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కేవలం ఒక మీడియా వర్గం మాత్రమే ప్రచారం చేస్తుందని తెలిపారు. అమరావతిలో వరదల కారణంగా ఎవరూ అక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
వరదల భయంతో...
నిత్యం వరదలు ఆ ప్రాంతాన్ని భయపెడుతుంటాయని, అందుకే అక్కడకు వెళ్లి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని ఆయన అభిప్రాయపడ్డారు.హైడ్రా భయం అనేది ప్రజల్లో ఏమీ లేదని అన్నారు. అన్నీ పరిశీలించిన తర్వాతనే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు నగరానికే ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.