నేడు ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

Update: 2022-06-28 02:07 GMT

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుంచి 24వ తేదీ వరకూ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

ఫలితాలను చూసుకోవచ్చు....
అయితే వాల్యుయేషన్ వారం రోజుల క్రితమే పూర్తయింది. కానీ సాంకేతిక లోపాలు లేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈరోజు అధికారులు ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఫలితాలను చూసుకోవాలంటే https://tsbie.cog.gov.in తో పాటు https://results.cgg.gov.in, https://examresults.nic.in వంటి వెబ్ సైట్లలో పదకొండు గంటల తర్వాత చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News