హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది

ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

Update: 2021-12-18 06:29 GMT

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ తో అనేక అంతర్జాతీయ కేసులు సత్వరం పరిష్కారమవుతాయని చెప్పారు. దేశానికి హైదరాబాద్ లోని ఈ సెంటర్ తలమానికంగా నిలుస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. చాల తక్కువ సమయంలోనే ఈ సెంటర్ పనులను ప్రభుత్వం పూర్తి చేసిందని, ఇందుకు ధన్యవాదాలని ఆయన చెప్పారు.

శాశ్వత భవనం కోసం....
హైదరాబాద్ ను ప్రేమించే వారిలో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సెంటర్ శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో స్థలం కేటాయించామని, త్వరలో శాశ్వత భవనాన్ని పూర్తి చేసుకుని అందులోకి వెళ్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం తాత్కాలికంగా నానక్ రామ్ గూడలోని వీకే టవర్స్ లో ఈ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డి తదిరులు హాజరయ్యారు.


Tags:    

Similar News