సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్.. అసలు రీజన్ అదే
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు పది రోజులు మూసివేయాలని నిర్ణయించారు
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు పది రోజులు మూసివేయాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాని యజమానుల అసోసియేషన్ నిర్ణయించింది. సినిమాల విడుదల లేకపోవడంతో పది రోజుల పాటు మూసివేయడం మంచిదని థియేటర్ల యాజమాన్యం భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
నిర్వహణ వ్యయం పెరగడంతో...
ప్రస్తుతం నాలుగు షోలు రోజుకు నడుస్తున్నా ఒక్క షో కూడా హౌస్ ఫుల్ కాకపోవడం, ఆదాయం రాకపోవడంతో పాటు నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. శుక్రవారం నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత బడనున్నాయి. పది రోజుల తర్వాత తిరిగి తెరుచుకునే అవకాశాలున్నాయి.