వైఎస్ షర్మిలను అరెస్ట్ చేస్తారా?

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు తెలిసింది.

Update: 2022-11-28 06:53 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు తెలిసింది. నర్సంపేటలో జరుగుతున్న పాదయాత్రలో పెద్దయెత్తున పోలీసులు పాల్గొనడంతో ఈ ఊహాగానాలు వ్యాపించాయి. నర్సంపేటలో జరగుతున్న పాదయాత్రలో నలుగురు ఏసీపీలు, 500 మంది పోలీసులు ఒక్కసారిగా రావడంతో షర్మిలను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గుప్పమన్నాయి.

ఆదేశాల కోసం...
ఉన్నతాధికారుల ఆదేశాల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. నిన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు పెద్దయెత్తున మొహరించారని చెబుతున్నారు.


Tags:    

Similar News