సింబల్స్ ప్రభావం లేనట్లే.. ఊపిరి పీల్చుకున్న టీఆర్ఎస్
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిసింది
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిసింది. ఎందుకంటే నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ తమకు ప్రమాదంగా భావిస్తున్న గుర్తులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. రోడ్డు రోలర్, చపాతీ రోలర్ కు ఓటర్లు కారు అనుకుని ఓటు వేస్తారనుకుని టీఆర్ఎస్ భయపడింది. దీంతో హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది.
ఆ గుర్తులతో...
అయితే నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి రోడ్డు రోలర్ గుర్తుకు 34, చపాతీ రోలర్ కు 84 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. ప్రచారంలో డమ్మీ ఈవీఎంలు తీసుకుని టీఆర్ఎస్ నేతలు ఇంటింటికీ ప్రచారం చేయడంతో గుర్తుల ఇబ్బంది నుంచి బయటపడిందనే చెప్పాలి.