Kalvakuntla Kavitha : కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. జులై 5వ తేదీ వరకూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15వ తేదీన అరెస్టయిన కవిత తీహార్ జైలులో ప్రస్తుతం ఉన్నారు.
ముగియడంతో...
ఆమె జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండటంతో మరోసారి పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో కల్వకుంట్ల కవిత జులై 5వ తేదీ వరకూ తీహార్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మద్యం లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఉందని, ఆమెకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ తరుపున న్యాయవాదులు వాదించారు.