Kalvakuntla Kavitha : కవిత రిమాండ్ నేటితో ముగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈరోజు కవితను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. కవితను మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చననున్నారు. గత మార్చి నెల 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తీహార్ జైలులో...
ఆమె తీహార్ జైలులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అయితే నిన్న సీీబీఐ, ఈడీ చేసిన అరెస్ట్ లపై కవిత వేసిన పిటీషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ మరింత పొడిగించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈరోజు కవితకు ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారన్నది తెలియనుంది.