Breaking : కమిషన్ కు కేసీఆర్ ఘాటు లేఖ.. పన్నెండు పేజీలతో

చత్తీస్‌గడ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై 12 పేజీల లేఖను జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాశారు.;

Update: 2024-06-15 06:45 GMT
kcr, brs chief, gaddam srinivas yadav, hyderabad parliament
  • whatsapp icon

జస్టిస్ నరసింహారెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లేఖ రాశారు. చత్తీస్‌గడ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం విషయంపై కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్ద అని, ఆయనకు తెలంగాణలో విద్యుత్తు అవసరాల గురించి తెలుసునని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ తాను రాసిన లేఖలో కోరారు.

సహజ న్యాయసూత్రాలకు....
కమిషన్ వ్యవహరించిన తీరు సరిగా లేదని అన్నారు. తన వివరణ అందకముందే తీర్పుచెప్పే విధంగా కమిషన్ మీడియా సమావేశం పెట్టి వెల్లడించడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ లేఖలో తెలిపారు. కావాలనే విద్యుత్తు కొనుగోలు విషయంలో తప్పు పట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన లేఖలో ఆరోపించారు. గత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్న తపన కమిషన్ లో కనపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విచారణకు హాజరవ్వడానికి తాను సిద్ధంగా లేనని కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఈ కమిషన్ ను నియమించారని కేసీఆర్ పన్నెండు పేలజీల లేఖలో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి తీరు సహజ న్యాయసూత్రాాలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.


Tags:    

Similar News