KA Paul: ఆయన పోరాడుతూనే ఉన్నారు.. తెలంగాణ హైకోర్టు ఏమి చేస్తుందో?
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టును
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు చాలా కామన్ అయిపోయాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఎవరు వచ్చినా మీకోసం తలుపులు తెరచే ఉంటాయని తేల్చేసింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కొందరు నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి క్యూ కట్టే నాయకులు ఇంకా చాలా మందే ఉన్నారని అంటున్నారు.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ లో గందరగోళం కాస్త నెలకోగా.. ఎవరూ ఊహించని విధంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి అధికారం కోసం పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆరు నెలలు తిరగక ముందే ఇంకొక (కాంగ్రెస్ పార్టీ) తరపున ఎంపీగా పోటీ చేశారని అన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీ మారడం ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.