కడెం ప్రాజెక్టుకు భారీ వరద

కడెం ప్రాజెక్టును వరద ముంచెత్తుతోంది. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు

Update: 2022-07-13 08:04 GMT

కడెం ప్రాజెక్టును వరద ముంచెత్తుతోంది. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు 17 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న 25 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రాత్రంతా కండెం ప్రాజెక్టు వద్దనే అధికారులు ఉండి పరిస్థితిని సమీక్షించారు. సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులు కాగా ఐదు లక్షలు వస్తున్నాయి.

ఇదే అతి పెద్ద....
1995 తర్వాత ఇదే అది పెద్ద వరద అని అధికారులు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.3 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థిితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే కొద్ది సేపటి నుంచి కొంత వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. పైన భారీ వర్షాలు పడకుండా, వరద నీరు పెరగకుండా ఉంటే ప్రమాదం నుంచి బయటపడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇన్‌ ఫ్లో ఎక్కువగా ఉండటం, అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతోనే ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News