Kalvakuntla Kavitha : ఆ తల్లి విగ్రహం తీసేసి మీ నేత విగ్రహం పెడతారా?
తెలంగాణ తల్లి విగ్రహం స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామనడంపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు
తెలంగాణ తల్లి విగ్రహం స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామనడంపై కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనమండలిలో కవిత మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చడం కాదని ఆ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో గత ప్రభుత్వం పెట్టాలని భావించన చోట మాత్రమే ఏర్పాటు చేయాలని కవిత కోరారు.
పునరాలోచించాలని...
అలా కాకుండా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెడితే తెలంగాణ తల్లిని అవమానించినట్లేనని కవిత పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.