తెలంగాణలోనే టీడీపీ బెటర్ అట!!

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ

Update: 2023-10-28 14:52 GMT

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ వచ్చింది.. తాజాగా కన్ఫర్మ్ అయింది. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయిన తర్వాత కాసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ పోటీ బాగుంటదని.. ఏపీ కంటే తెలంగాణలోని టీడీపీ బాగుందన్నారు. ఇపుడున్న అన్ని పార్టీల్లో కంటే టీడీపీ బెటర్ అని.. నాయకుల్లో చంద్రబాబు బెస్ట్ లీడర్ అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలంగాణలో ఎన్ని సీట్లపై పోటీ చేయాలనేది అక్టోబర్ 29న లోకేష్ తో చర్చించి చెబుతామన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తామని.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయడం లేదన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చర్చించారు


Tags:    

Similar News