కవిత డెసిషన్ : చివరి నిమిషంలో ట్విస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు విచారణకు హాజరుకాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ పంపారు;

Update: 2023-03-16 06:27 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు విచారణకు హాజరుకాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ పంపారు. బీఆర్ఎస్ ప్రతినిధి సోమా భరత్ ద్వారా లేఖను ఈడీ కార్యాలయానికి పంపారు. నలుగురు న్యాయవాదుల బృందం ఈడీని కలిసి విజ్ఞప్తి చేశారు. కవిత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈరోజు విచారణకు హాజరు కాలేనని, సుప్రీంకోర్టులో పిటీషన్ లో పెండింగ్ లో ఉండటంతో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని తెలిపారు.

విచారణకు హాజరు కాలేనంటూ...
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు మాత్రం కవిత విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లు సమాచారం. ఈడీ విచారణకు రావాల్సిందేనని కవిత న్యాయవాదులకు ఈడీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే కవిత ఈడీ అధికారుల ఎదుటకు ఈరోజు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కవిత విచారణకు హాజరు కాకుంటే ఈడీ అధికారులు ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషంలో కవిత ఈ లేఖ అందించడంతో ఈడీ అధికారులు కూడా అవాక్కయినట్లు తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కవితను హాజరవ్వాలని ఆదేశించే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News