ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని కేసీఆర్ తెలిపారు. యధాతథంగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

Update: 2022-03-21 12:24 GMT

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. యధాతథంగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. గతంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మరోసారి తమకు అధికారంలోకి రావాలని భావించి ప్రజల ఆశీర్వాదం కోసం అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని, ఇప్పుడు ఆ అవసరం లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని, కొన్ని పెండింగ్ లో ఉన్నా యని చెప్పారు.

సర్వేలో తమదే పైచేయి....
మతి సరిగా లేనివాళ్లే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడతారని అన్నారు. స్థాయిలేని వారే అలా మాట్లాడతారని చెప్పారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదన్నారు. 95 నుంచి 105 స్థానాల మధ్య గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిన్ననే సర్వే నివేదిక ఒకటి తనకు అందిందని, 30 స్థానాల్లో 29 స్థానాల్లో తాము గెలవబోతున్నట్లు సర్వే రిపోర్టు వచ్చిందన్నారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ చెప్పారు. రాజకీయాల్లో విజయానికి సిచ్యుయేషన్, ఈక్వేషన్ ముఖ్యమని కేసీఆర్ చెప్పారు.


Tags:    

Similar News