నేడు టీఆర్ఎస్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. రానున్న కాలంలో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం నేడు జరగనుంది. రానున్న కాలంలో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు జరిగే సమావేవంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అన్ని పదవుల్లో ఉన్న నేతలు హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
పథకాలను....
ప్రధాన శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ లను రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. వారు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ద్వితీయ శ్రేణి నేతలతో నేరుగా కేసీఆర్ సమావేశం కానున్నారు. ఏడేళ్ల నుంచి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో పాటు వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటనపై కూడా చర్చ జరగనుంది.