మేం ఛీటర్‌తో కలవం : కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ ఫైటర్ అని ఛీటర్ తో కలసి పనిచేయరని మంత్రి కేటీఆర్ అన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-10-03 13:52 GMT

కేసీఆర్ ఫైటర్ అని ఛీటర్ తో కలసి పనిచేయరని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. మోదీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ అవార్డు వస్తుందని కేటీఆర్ అన్నారు. మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని కేటీఆర్ కొట్టిపారేశారు. మోదీ ఎంత అరిచినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌నే మళ్లీ కోరుకుంటారని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలారా అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాజు.. యువరాజు అంటూ ఏదో మాట్లాడరన్నారు. అకాలీదళ్, పీడీపీ, టీడీపీల విషయంలో అనాడు రాచరికం గుర్తుకు రాలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఎవరికీ గులాంలు కాదన్నారు.

రాచరికం అప్పుడు...
మోదీ ఎన్‌ఓసీ తమకు అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్ రాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను సీఎం కావడానికి మోదీ పర్మిషన్ అవసరం లేదన్నారు. కీలక పార్టీలే ఎన్డీఏను వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము కర్ణాటకకు డబ్బులు పంపుతుంటే మీ ఐటీ టీం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆయనతో ఉంటే మంచి లేదంటే చెడుగా చిత్రీకరిస్తారన్నారు. దేవగౌడ కుమారుడితో కలిసినప్పుడు రాచరికం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. జైషా ఎవరు ఆయనకు క్రికెట్ పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మీరు భయపెడితే తాము భయపడబోమన్న కేటీఆర్ ఈ మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరన్నారు.


Tags:    

Similar News