కేటీఆర్ కుమారుడు హిమాన్షును పొగడ్తలతో ముంచేస్తున్నారే

సౌకర్యాల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలకు ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు చొరవతో సదుపాయాలు

Update: 2023-07-11 02:54 GMT

మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. హిమాన్షు ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దడమే అందుకు కారణంగా. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశాడు. హిమాన్షు ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలో చదివే సమయంలో గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించాడు. పాఠశాలలోని విద్యార్థులతో షిమాన్షు మాట్లాడాడు. పేద విద్యార్థులు చదివే ఆ పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పాఠశాలను దత్తత తీసుకోవాలని భావించాడు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దాడని ఆ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ రాములు యాదవ్‌ వెల్లడించారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను హిమాన్షు ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు.

సౌకర్యాల లేమితో సతమతం అవుతున్న ప్రభుత్వ పాఠశాలకు ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు చొరవతో సదుపాయాలు సమకూరడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. తాను చదివే పాఠశాలలో నిధులు సేకరించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించాడు. గత ఏడాది తమ పాఠశాల క్యాస్‌ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన హిమాన్షు అక్కడి సమస్యలను చూసి వసతులు కల్పించాలని అనుకున్నాడు. మిత్రులు, సహచర విద్యార్దుల నుంచి సమీకరించిన నిధులతో తరగతి గదులను ఆధునికంగా తీర్చిదిద్దారు. పాత గదులతో పాటు అదనంగా రెండు తరగతి గదులను నిర్మించారు.


Tags:    

Similar News