ఘనంగా లాల్ దర్వాజ బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతోంది. ఎటుచూసినా బోనాల జాతర సందడే కనిపిస్తుంది. మహిళలు, యువతులు కొత్త పట్టువస్త్రాలు, నగలతో ముస్తాబై.. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఆలయానికి విచ్చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతర సందర్భంగా పాతబస్తీ పరిసరప్రాంతాల్లో 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. చార్మినార్ పోలీస్ స్టేషన్ నుంచి అధికారులు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. అంబర్ పేట, చార్మినార్, మీర్ చౌక్, నయాపూల్, బహదూర్ పురాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.