Madhu Yashki : మధు యాష్కీ ఇంట్లో సోదాలు

ఎల్.బి.నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి పోలీసులు వచ్చారు;

Update: 2023-11-15 03:49 GMT
madhu yashki, police, searches, congress
  • whatsapp icon

ఎల్.బి.నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి ఇంట్లో సోదాలు నిర్వహించడానికి పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో మధు యాష్కి వాగ్వాదానికి దిగారు. ఎవరి అనుమతితో తన ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వచ్చారని నిలదీశారు. అందుకు అవసరమైన అనుమతులను చూపించాలని కోరారు. పోలీసులు రావడంతో ఆయన అనుచరులు కూడా పెద్దయెత్తున చేరి సోదాలకు అభ్యంతరాలు తెలిపారు.

డబ్బు ఉందని...
మధు యాష్కి ఇంట్లో పెద్దయెత్తున డబ్బు ఉందన్న సమాచారంతో సోదాలు నిర్వహించడానికి వచ్చామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన సోదాలను అడ్డుకున్నారు. కేవలం అధికార పార్టీ వత్తిడితోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలోనే సోదాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. తాను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. హయత్ నగర్ లో ఉన్న మధు యాష్కీ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వచ్చిన పోలీసులను ఆయనతో పాటు ఆయన అనుచరులు నిలదీశారు.


Tags:    

Similar News