Telangana : పులి దాడిలో యువతి మృతి... ఆదిలాబాద్ జిల్లాలో కలకలం

కుమురం భీం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. యువతిపై దాడి చేసింది.;

Update: 2024-11-29 06:49 GMT
leopard, attack,young woman, kumuram bheem district
  • whatsapp icon

కుమురం భీం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. యువతిపై దాడి చేసింది. కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ మండలం గన్నారం సమీపంలో చిరుతపులి దాడి చేయడంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. చిరుతపులి దాడిలో మరణించిన యువతిని మోర్లె లక్ష్మిగా గుర్తించారు. లక్ష్మి వయసు 21 సంవత్సరాలు. కూలీ పనికి వెళ్లిన లక్ష్మిపై చిరుతపులి దాడి చేసింది.

కూలీకి వెళ్లడంతో...
అయితే పక్కనే ఉన్న కూలీలు అది చూసి కేకలు వేయడంతో అది అడవిలోకి పారిపోయింది. అయితే అప్పటికే చిరుతపులి దాడిలో లక్ష్మి మరణించింది. దీంతో ఈ ప్రాంతంలో చిరుత పులి సంచారాన్ని కలకలం రేపుతుంది. యువతి ప్రాణాలను బలి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయం వద్ద లక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు


Tags:    

Similar News