సర్వేలన్నీ అనుకూలమే... స్పీడ్ తగ్గిన కారు

తెలంగాణలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని అనేక సర్వేలు ద్వారా వెల్లడవుతుంది

Update: 2023-10-06 06:17 GMT

తెలంగాణలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని అనేక సర్వేలు ద్వారా వెల్లడవుతుంది. ఎన్నికల సమయంలో అనేక సర్వేలు బయటకు వస్తున్నాయి. పార్టీలతో పాటు అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది ఈ సర్వేల్లో వెల్లడించడం కామన్. ఎన్నికలకు ముందు జనం నాడి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తారు. అలాగే పోలింగ్ అనంతరం చేసే సర్వేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎవరిది అధికారమో చెప్పే వీలుంటుంది.

60 వేలమంది...
తాజాగా తెలంగాణలో లోక్‌పాల్ నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే. అయితే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోనే ఉండటం ఆ పార్టీ నేతలకు కొత్త జోష్ నిచ్చింది.ఈ ఏడాది ఆగస్టు పదోతేదీ నుంచి సెప్టంబరు 30వ తేదీ వరకూ తెలంగాణలో లోక్‌పాల్ సర్వే సంస్థ నిర్వహించింది. మొత్తం అరవై వేల మంది అభిప్రాయాలను సేకరించింది.
ఓటింగ్ శాతం..
ఈ సర్వేలో కాంగ్రెస్‌కు 61 నుంచి 67 స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. అధికార బీఆర్ఎస్‌కు 45 నుంచి 51 స్థానాలకు పరిమితమవుతుందని సర్వేలో తేల్చింది. భారతీయ జనతా పార్టీ కేవలం రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. ఎంఐఎం ఆరు నుంచి ఎనిమిది స్థానాలను గెలుచుకుంటుందని చెప్పింది. ఇతరులు ఒక స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తేల్చింది. కాంగ్రెస్‌కు 41 నుంచి 44 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 39 నుంచి 42 శాతం, బీజేపీకి పది నుంచి పన్నెండు శాతం, ఎంఐఎం మూడు నుంచి నాలుగు శాతం, ఇతరులకు మూడు నుంచి ఐదు శాతం ఓట్లు వస్తాయని లోక్‌పాల్ సర్వేలో తేల్చింది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీ కార్డు సత్ఫలితాలనిస్తుందని ఈ స్వే తేల్చింది. అనేక వర్గాలు అధికార బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నాయని సర్వేలో తేటతెల్లమయింది.
Tags:    

Similar News