మినీ మేడారం జాతర నేటి నుంచి

మేడారం అంటేనే సమ్మక్క సారలమ్మ గుర్తుకు వస్తారు. నేటి నుంచి మేడారంలో మినీ జాతర జరగనుంది

Update: 2023-02-01 03:06 GMT

మేడారం అంటేనే సమ్మక్క సారలమ్మ గుర్తుకు వస్తారు. నేటి నుంచి మేడారంలో మినీ జాతర జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ మినీ జాతరకు వేల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈరోజు నుంచి నాలుగో తేదీ వరకూ ఈ మినీ జాతర జరగనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. అయితే మధ్యలో మాత్రం మినీ జాతర నిర్వహించి గద్దెలను శుభ్రపరుస్తారు.

30 లక్షల మంది భక్తులు...
మినీ జాతరకు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మినీ జాతరకు ముప్పయి లక్షల మంది వచ్చే అవకాశముందన్న అంచనాలు ఉణ్నాయి. ఈరోజు మండమెలిగే పండగను నిర్వహించనున్నారు. రేుపు సారలమ్మ గద్దె, 3న సమ్మక్క గద్దె శుద్ధి చేయనున్నారు. మొక్కులు చెల్లించేందుకు కూడా భక్తులకు అనుమతిస్తుండటంతో పెద్దయెత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News