ఆ జాతర తర్వాత కరోనా విలయమేనట
తెలంగాణలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది.
తెలంగాణలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది. మేడారం జాతర ముగిసిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. పెద్ద జాతర కావడంతో భౌతిక దూరం పాటించడం కూడా కష్టమే. దీంతో మేడారం జాతర ముగిసిన తర్వాత కరోనా కేసులు మరింత పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది.
అప్పుడే నైట్ కర్ఫ్యూ...
ఆంధ్రప్రదేశ్ లో కూడా సంక్రాంతి పండగ తర్వాతనే కేసులు పెరిగాయి. రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెట్టింది. ప్రస్తుతం తెలంగాణలో రోజుకూ మూడు నుంచి నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి. రోజూ లక్ష నమూనాలు పరీక్షిస్తున్నారు. దీంతో మేడారం జాతర తర్వాత కేసుల సంఖ్య పెరిగితే నైట్ కర్ఫ్యూ పెట్టే అవకాశముందని, పదిశాతం పాజిటివిటీ రేటు దాటితేనే నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయి.