కాంగ్రెస్ కొత్త ప్రయత్నం.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు?
మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలందరూ పాల్గొననున్నారు
నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా నేతలందరూ పాల్గొననున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే సీఎల్పీ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించి, వాయిదాల తీర్మానాల రూపంలో వాటిని సభ ముందుకు తెచ్చి అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు..
అయితే ఈసారి కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఎంపీలు, మాజీ పీసీసీ చీఫ్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు అవుతున్నారు. వీరి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి ద్వారా వచ్చిన సమస్యలను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయత్నం చేస్తుంది.