షోకాజ్ నోటీసులు చెత్త బుట్టలో వేశారు

తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఎప్పుడో చెత్తలో పడేశారని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు

Update: 2023-01-12 06:54 GMT

తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఎప్పుడో చెత్తలో పడేశారని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రేతో గంటన్నర పాటు సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ విషయాలన్నీ పూర్తిగా చర్చించానని తెలిపారు. తాను బిజీగా ఉండటం వల్లనే నిన్న గాంధీభవన్ కు రాలేదన్నారు. సీతక్క, జగ్గారెడ్డి, పొడెం వీరయ్య లాంటి వాళ్లు కూడా రాలేదని వారిని ఎందుకు అడగరని ప్రశ్నించారు. తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు.

తొలి నుంచి పనిచేసిన వారికి...
పార్టీకి తొలి నుంచి పనిచేసిన వారిని పట్టించుకోని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాను పార్టీ పరిస్థితిని ఆయనకు తనకు తెలిసినంత మేరకు తెలియజెప్పి వచ్చానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో చెప్పి వచ్చానని కోమటిరెడ్డి తెలిపారు. పార్టీలో మరికొన్ని విషయాలను తాను చెప్పానని, అయితే అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను మీడియాకు చెప్పనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.


Tags:    

Similar News