ఉభయ సభల్లో టీఆర్ఎస్ నిరసన

పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళనకు దిగారు;

Update: 2022-02-10 12:03 GMT

పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ, లోక్ సభలోనూ వారు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమన నిరసనను తెలియజేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రధాని పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్....
ఇప్పటికే రాజ్యసభలో ప్రధాని మోదీపై టీఆర్ఎస్ సభ్యులు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. లోక్ సభలోనూ అదే చేశారు. లోక్ సభ జనరల్ సెక్రటరీకి ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ పిటీష్న్ ఇచ్చారు. ప్రధాని ప్రొసీజర్స్ ను, ప్రొసీడింగ్స్ ను ఛాలెంజ్ చేశారని అనంతరం మీడియాతో టీఆర్ఎస్ సభ్యులు వివరించారు. పార్లమెంటులో విభజన సందర్భంగా ఏదో ఘోరం జరిగినట్లు ప్రధాని మాట్లాడారన్నారు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.


Tags:    

Similar News