నేడు తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది;
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భం నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఈ ద్రోణి ఏర్పడిందని తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయింది.
అత్యధికంగా...
శని, ఆదివారాలు కూడా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసాయి. ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలోని చింతకుంటలో 13.9 , వడ్డెమాన్ లో10.2, నారయణపేట జిల్లా జక్లేర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.