Rain Alert : తెలంగాణలో రెండు రోజులు వర్షాలేనట
తెలంగాణలో వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలో వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణలో ిఇటీవల కాలంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
దసరా శరన్నవరాత్రి....
ఈరోజు నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు సిద్ధమవుతున్న తరుణంలో వర్షాలు తమ పండగకు ఆటంకం కలుగుతుందేమోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో పెద్దయెత్తు ఈ సంబురాలు జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. వర్షం అలా వచ్చి ఇలా వెళ్లిపోతే పండగ సజావుగా జరుపుకుంటామని కోరుకుంటున్నారు.