తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.;
ఈ నెల 9న తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అనేక జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
పిడుగులు పడే...
ఇక ఏపీలోనూ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు ఈ మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.