Telangana : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎక్కడెక్కడంటే?
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు. రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈదురుగాలులు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, మెదక్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెండ, వరంగల్, హన్మకొంద, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.