తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.;
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉందన్నారు. ఈ ప్రభవంతో విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరఠణ శాఖ తెలిపింది.
ధరలు పెరిగి...
నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై వస్తువులను కూడా అనేక మంది కోల్పోయారు. ఇక పండగ పూట మరోసారి భారీ వర్షాలు అంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఇటు పంట నష్టంతో పాటు అటు వానలతో వ్యాపారులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఎన్నాళ్లు ఈ వానలు అని ప్రజలు విసుక్కుంటున్నారు. వర్షాలతో కూరగాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.