మెట్రో ఆఖరి రైలు ఎప్పుడంటే?

హైదరాబాద్ లో మెట్రో రైళ్ల సర్వీసుల వేళలను పొడిగిస్తూ మెట్రో రైలు ఎండీ కీలక నిర్ణయం తీసుకున్నారు

Update: 2022-10-07 12:47 GMT

హైదరాబాద్ లో మెట్రో రైళ్ల సర్వీసుల వేళలను పొడిగిస్తూ మెట్రో రైలు ఎండీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వేళలను మరో అరగంట పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త వేళలు అమలులోకి రానున్నాయి. సవరించిన దాని ప్రకారం ఆఖరి మెట్రో సర్వీసు 11 గంటలకు ఉంటుంది.

11 గంటలకు...
ఇప్పటి వరకూ 10.30 గంటలకు ఆఖరి మెట్రో రైలు ఉంది. ఈ వేళలను మరో అరగంట పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లకు హైదరాబాదీలు అలవాటు పడ్డారు. సొంత వాహనాల కంటే మెట్రో రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లలో ఆక్యుపెన్సీ రేటు గణనీయంగా పెరిగింది. దీంతో మరో అరగంట అదనంగా రాత్రికి పొడిగించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News