మరో నాలుగు రోజులు అదిరే ఎండలు.. ఆరెంజ్ అలెర్ట్
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ తో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఎండలు మండి పోతున్నాయి. 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్క ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గత పదేళ్ల రికార్డు బద్దలయిందని వాతావరణ శాఖ తెలిపింది.
పదేళ్ల రికార్డు....
2016 లో మార్చి నెలలో ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, పదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అవే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మే నెలల 46 డిగ్రీలు దాటే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కన్నా మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగానే ఎండల తీవ్రత పెరిగిందని చెప్పింది.