మంత్రి కేటీఆర్ తో ఒవైసీ భేటీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ఒవైసీ మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్, విప్ పదవులపై చర్చించడానికి అసదుద్దీన్ అసెంబ్లీ ప్రాంగలణానికి వచ్చారని అంటున్నారు. శాసనమండలిలో విప్ కాని, డిప్యూటీ ఛైర్మన్ పదవి కాని ఎంఐఎం ఆశిస్తున్నట్లు తెలిసింది. ఎల్లుండి శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. రేపు నామినేషన్లను స్వీకరిస్తారు.
పదవుల కోసం కాదు....
అయితే కేటీఆర్ తో భేటీ అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను పదవుల కోసం మాట్లాడేందుకు ఇక్కడకు రాలేదని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్ తో చర్చించేందుకు వచ్చానని తెలిపారు. యూపీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉండదని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.