మేం రాజకీయంగా ఎదిగితే?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లింలు ఒక రాజకీయపార్టీ నేతగా ఎదగడం ఎవరికీ నచ్చదని ఆయన అన్నారు. పార్లమెంుకు అన్ని వర్గాల ఎంపీలు వస్తారని, కానీ ముస్లింలు మాత్రం రాజకీయంగా ఎదగడాన్ని సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
70 ఏళ్లుగా...
డెబ్బయి ఏళ్లుగా ముస్లిలంలను దోచుకుంటున్నారని, రాజకీయ పార్టీలు తమను బానిసలుగా చూ్తున్నారని అన్నారు. అగ్రకులాల వారే రాజకీయాల్లో కోరుకుంటుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ముస్లింలు, దళితులు, క్రైస్తవులు ఏకతాటిపైకి రావడం రాజకీయ పార్టీలకు అస్సలు నచ్చదని ఆయన అన్నారు. బీబీసీ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ఎందుకు నిషేధించారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కత్తులు, తల్వార్లతో దాడులు చేసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన హైదరాబాద్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.