Telangana : చలి పెరిగింది... జనం వణుకుతున్నారు

తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి.;

Update: 2024-11-30 04:54 GMT
minimum temperatures, cold waves, today, telangana
  • whatsapp icon

తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు గంటల అయినా రాకపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

అత్యల్ప ఉష్ణోగ్రతలు...
తెలంగాణలో ఇటీవల కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి ప్రజలు వణికిపోతున్నారు. ఇంత కనిష్ట స్థాయిలో గతంలో ఎన్నడూ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మెదక్‌లో 10.8 డిగ్రీలు, పటాన్‌చెరులో 11 డిగ్రీలు. నిజామాబాద్‌లో 13.5, హనుమకొండలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News