Weather Report : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ "చల్లని" కబురు
తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది;

తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు నిన్న సాయంత్రం నుంచి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బర్షాలు పడుతున్నాయి. సాయంత్రానికి చల్లటి వాతావరణం ఏర్పడటంతో ప్రజలు కొంత ఊరట చెందారు. నిన్న మొన్నటి వరకూ ఎండలతో అల్లాడిన ప్రజలు వర్షం కురవడంతో పాటు పలు చోట్ల చల్లటి వాతావరణం చోటు చేసుకోవడం కొంత ప్రజలకు ఊరట కలిగించేలా ఉంది. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
ఈదురుగాలులతో కూడిన...
ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారంకూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో కొంత రిలీఫ్ దొరుకుతుందనే చెప్పాలి. ఎండ వేడమితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఈ సమయంలో చల్లటి వాతావరణం తెలంగాణలో కొంత ప్రజలు సేదతీరినట్లే కనిపిస్తుంది.
రానున్న మూడు రోజులు...
వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా దక్షిణ విదర్భ వరకూ సముద్ర మట్టం నుంచి 0.9కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో చల్లటి వాతావరణంతో పాటు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి వరకూ 42 డిగ్రీల వరకూ నమోదయిన ఉష్ణోగ్రతలు ఈ మూడు రోజులు 39 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల వర్షం పడటంతో అనేక మంది హ్యాపీగా ఉన్నారు.