Kalvakuntla Kavitha : రేవంత్ కు సూటి ప్రశ్న వేసిన కవిత
రేవంత్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు;

రేవంత్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పారు. అదే గత పదిహేడు నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న రుణం 1,58 లక్షల కోట్ల రూపాయలు అని కవిత అన్నారు.
చేసిన అప్పులు ఎంతంటే?
గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అప్పుకు లెక్కలున్నాయన్న కల్వకుంట్ల కవిత రేవంత్ చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆక్షేపించారు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలంటూ కవిత డిమాండ్ చేశారు.