Telangana : నేడు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి;

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో నేడు బడ్జెట్‌పై చర్చించి ఆమోదించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం ప్రారంభం అవుతాయి. అయితే బడ్జెట్ పై చర్చ జరిగిన అనంతరం చర్చ అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఉభయ సభల్లో సమాధానం చెబుతారు.
బడ్జెట్ పై చర్చ అనంతరం...
అన్ని పార్టీలకు చెందిన వారు బడ్జెట్ చర్చల్లో పాల్గొంటారు. ఈ నెల 19న తెలంగాణ ప్రభుత్వం 3,04 లక్షల కోట్ల తో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ వాస్తవికతతో కూడినదని అధికార పార్టీ చెబుతుండగా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిధులు కేటాయింపులు జరపలేదని విపక్షాలు విమర్శించాయి. తర్వాత న్యాయ వాదుల సంక్షేమ బిల్లుపై సైతం చర్చించి ఆమోదించనుంది.